లీడ్స్ (ఇంగ్లండ్): పేసర్లు ఒలీ రాబిన్సన్ (3/29), జోఫ్రా ఆర్చర్ (3/50), జోష్ టంగ్ (3/43) ముప్పేట దాడి చేయడంతో పాకిస్థాన్‌తో తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 366/8తో శుక్రవారం ఆట కొనసాగించిన ఇంగ్లిష్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 238 రన్స్ ఆధిక్యం అందుకుంది. అనంతరం భారీ లోటు స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ 37.3 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ రిజ్వాన్ (41) తప్ప మిగతా బ్యాటర్లంతా నిరాశపరిచారు. రాబిన్సన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. మూడు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఈ నెల 27 నుంచి లార్డ్స్ స్టేడియంలో జరుగుతుంది.