ENG vs SL: తడబడుతున్న ఇంగ్లండ్.. నాలుగు వికెట్లు కోల్పోయిన బట్లర్ గ్యాంగ్
ENG vs SL: వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆడిన నాలుగుమ్యాచ్లలో మూడు ఓడి సెమీస్ రేసులో వెనుకబడ్డ ఇంగ్లండ్.. శ్రీలంకతో పోరులొ కూడా తడబడుతోంది.
ENG vs SL: వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆడిన నాలుగుమ్యాచ్లలో మూడు ఓడి సెమీస్ రేసులో వెనుకబడ్డ ఇంగ్లండ్.. శ్రీలంకతో పోరులొ కూడా తడబడుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్.. 15 ఓవర్ల ఆట ముగిసే సమయానికి నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు టాపార్డర్ విఫలమయ్యింది. ఆ జట్టు ఓపెనర్లు జానీ బెయిర్ స్టో (30), డేవిడ్ మలన్ (28) లతో పాటు వన్‌డౌన్‌లో వచ్చిన జో రూట్ (4), జోస్ బట్లర్ (8) కూడా పెవిలియన్ చేరాడు.
బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తప్పక గెలవల్సిన పరిస్థితి నెలకొంది. ఇదివరకే మూడు మ్యాచ్‌లు ఓడిన ఇంగ్లండ్.. ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే ఇక సెమీస్ ఆశలను వదులుకున్నట్టే అవుతోంది. టాప్- 3 బ్యాటర్లు నిష్క్రమించిన వేళ అనుభవజ్ఞులైన బెన్ స్టోక్స్, కెప్టెన్ జోస్ బట్లర్ మీదే ఇంగ్లండ్ ఆశలు పెట్టుకుంది. ఈ ఇద్దరూ నిష్క్రమిస్తే ఇంగ్లండ్ భారీ స్కోరు చేసే అవకాశాలు సన్నగిల్లుతాయి. 15 ఓవర్లు ముగిసేసరికి 77 పరుగులు చేసింది. స్టోక్స్ (4 నాటౌట్),లియామ్ లివింగ్‌స్టోన్ లు క్రీజులో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

