ENG vs NED: వన్డే వరల్డ్ కప్‌లో అత్యంత పేలవ ప్రదర్శనతో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకున్న ఇంగ్లండ్.. పరువు నిలుపుకునేందుకు గాను నేడు నెదర్లాండ్స్‌తో తలపడుతున్నది. మహారాష్ట్రలోని పూణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో వరుసగా విఫలమవుతున్న ఇంగ్లీష్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో (15) మరోసారి నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్ డేవిడ్ మలన్ మాత్రం ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు.
ఆర్యన్ దత్ వేసిన ఏడో ఓవర్లోనే బెయిర్ స్టో.. వాన్ మీకెరెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 48 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. కానీ మలన్ మాత్రం నెదర్లాండ్స్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. 36 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకున్న మలన్.. ఆ తర్వాత వేగాన్ని పెంచాడు. 19 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్.. ఒక వికెట్ నష్టానికి 128 పరుగులు చేసింది. డేవిడ్ మలన్ (82 బ్యాటింగ్), జో రూట్ (28 బ్యాటింగ్) లు క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలవకుంటే 2025లో జరుగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు కోల్పోనుంది.
36-ball 5️⃣0️⃣ for Dawid Malan 💥
A 7th in ODI cricket 🏴 pic.twitter.com/Xg33G1u5Sh
— Sky Sports Cricket (@SkyCricket) November 8, 2023