భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కింది. కెప్టెన్ జోస్ బట్లర్ (18) విఫలమైనప్పటికీ.. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (23 నాటౌట్), డేవిడ్ మలాన్ (7 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో అడపాదడపా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలోనే పవర్‌ప్లే ముగిసే సరికి ఇంగ్లండ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 52 పరుగులతో నిలిచింది. ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేది కావడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసేలా కనిపిస్తోంది.