భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ క్రమంలోనే బుమ్రా వేసిన 11వ ఓవర్లో శామ్ కర్రాన్ (2) కూడా అవుటయ్యాడు. బుమ్రా వేసిన బంతిని మిడాఫ్ మీదుగా బౌండరీ తరలించేందుకు ప్రయత్నించిన కర్రాన్.. టైమింగ్ మిస్సయ్యాడు.
దాంతో గాల్లోకి లేచిన బంతిని మిడాఫ్‌లో ఉన్న పాండ్యా వెనక్కు పరిగెడుతూ అందుకున్నాడు. ఆ తర్వాత కూడా చక్కగా బ్యాలెన్స్ నిలుపుకోవడంతో కర్రాన్ మైదానం వీడాడు. అంతకుముందు చాహల్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్ (19) కూడా అవుటయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు 11 ఓవర్లలో 61/6 స్కోరుతో నిలిచింది.