అబుధాబి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ ముష్ఫికర్ రహీమ్ అదుకున్నాడు. పవర్‌ప్లే ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టుకు రహీమ్, కెప్టెన్ మహ్మదుల్లా అండగా నిలిచారు. వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.
అదే సమయంలో చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ రన్‌రేట్ మరీ పడిపోకుండా చూసుకున్నారు. ఈ క్రమంలో పది ఓవర్లు ముగిసే సరికి బంగ్లా జట్టు 60/3తో నిలిచింది. ముష్ఫికర్ రహీమ్ 27, మహ్మదుల్లా 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.