హైదరాబాద్ ఆట ప్రతినిధి : ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పికిల్‌బాల్ క్రీడను తెలంగాణ వ్యాప్తంగా అందరికీ చేరువ చేసి ఆటను ప్రోత్సహిస్తామని హైదరాబాద్ పికిల్‌బాల్ సంఘం అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు అన్నారు. ఆటలో ప్రతిభావంతులను గుర్తించి వాళ్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా కృషిచేస్తామని చెప్పారు. సోమవారం కొండాపూర్ బొటానికల్ గార్డెన్ సమీపంలో పాడిల్వెల్ అనే సంస్థకు చెందిన పికిల్‌బాల్, బాక్స్ క్రికెట్, సాకర్ కోర్టులను ప్రారంభించిన శ్రీనివాస్ బాబు.. నిర్వాహకులను అభినందించారు.