అస్తానా: కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ అభిషేక్ యాదవ్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల 67 కిలోల క్వార్టర్స్ విభాగంలో అభిషేక్.. 5-0 తేడాతో కజకిస్థాన్కే చెందిన రఖత్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాడు. కానీ పవన్ (54 కిలోలు), కవిందర్ సింగ్ (57 కిలోలు) క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టారు.