బెంగళూరు: వచ్చే నెల 9 నుంచి ప్రారంభం కాబోయే మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు షాక్ తగిలింది. ఆ జట్లకు చెందిన ఇద్దరు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎల్లీస్ పెర్రీ (ఆర్సీబీ), అన్నాబెల్ సదర్లండ్ (డీసీ) తాజా సీజన్‌కు దూరమయ్యారు. వారిద్దరూ వ్యక్తిగత కారణాలతో ఈ సీజన్ నుంచి వైదొలుగుతున్నట్టు డబ్ల్యూపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. పెర్రీ స్థానాన్ని బెంగళూరు.. సయాలి సత్ఘరెతో భర్తీ చేయనుండగా క్యాపిటల్స్ జట్టు అన్నాబెల్ ప్లేస్‌లో అలానా కింగ్‌ను తీసుకుంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ తారా నోరిస్ (యూపీ వారియర్స్) సైతం దూరమవడంతో ఆమె స్థానంలో యూపీ మరో ఆసీస్ ఆల్‌రౌండర్ చార్లి నాట్‌ను ఎంపికచేసింది. ఇక గత సీజన్ మాదిరిగానే 2026 లోనూ గుజరాత్ జెయింట్స్.. ఆసీస్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ను తమ సారథిగా కొనసాగించనుంది.