మాంట్రీల్ : నాలుగు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, జపాన్ స్టార్ ప్లేయర్ నవొమి ఒసాకా కెనడా ఓపెన్‌లో అదరగొడుతున్నది. మాంట్రీల్లో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఒసాకా.. మంగళవారం రాత్రి జరిగిన క్వార్టర్స్ పోరులో 6-2, 6-2తో పదో సీడ్ ఎలీనా స్వితోలినాను చిత్తుచేసి సెమీస్ చేరింది. సెమీస్‌లో ఒసాకా 16వ సీడ్ క్లారా టాసన్తో తలపడనుంది.
యూఎస్ ఓపెన్‌కు ముందు జరుగుతున్న ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడం ఒసాకా కెరీర్లో ఇదే మొదటిసారి. 2021లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన తర్వాత ఒక్క టూర్ టైటిల్ కూడా నెగ్గని ఆమె.. కెనడా ఓపెన్‌ను గెలవాలనే పట్టుదలతో ఉంది. మరో క్వార్టర్స్‌లో టాసన్.. 6-1, 6-4తో మాడిసన్ కీస్‌ను ఓడించింది.