మెల్బోర్న్: ఎలినా రిబకినా(Elena Rybakina) సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్ వన్ అరినా సబలెంకను ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని అందుకున్నది. రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో.. రిబకినా మూడవ సెట్లో అనూహ్య రీతిలో సత్తా చాటింది. కజకిస్తాన్ అయిదో సీడ్ ప్లేయర్ రిబకినా మూడవ సెట్లో ఓ దశలో 3-0 తేడాతో వెనుకబడి ఉన్నది. కానీ ఆ తర్వాత కోలుకున్న ఆమె తిరుగులేని ఆటను ప్రదర్శించింది. వరుసగా అయిదు గేమ్‌లను గెలిచి 6-4 4-6 6-4 స్కోరుతో మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసింది. 2023 ఫైనల్లో సబలెంక చేతిలో రిబకినా ఓడింది. ఆ ఓటమికి ఇప్పుడు ఆమె రివేంజ్ తీసుకున్నది. యూఎస్ ఓపెన్ చాంపియన్ అయిన సబలెంక.. గత నాలుగు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌లో మూడింటిని కోల్పోయింది. గత ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ పైనల్స్లోనూ ఆమె ఓటమి పాలైంది.