Asia Shooting Championship : భారత యువ షూటర్ ఎలవనిల్ వలరివన్ (Elavenil Valarivan) మరోసారి పతకంతో మెరిసింది. కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ (Asia Shooting Championship)లో టీమ్ విభాగంలో కాంస్యం గెలుపొందిన ఆమె.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత పోటీల్లో గోల్డ్ మెడల్ కొల్లగొట్టింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో గురి తప్పకుండా పాయింట్లు సాధించి పోడియం మీద మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది ఎలవనిల్. ఇదే విభాగంలో మెహులి ఘోష్ నాలుగో స్థానంతో నిరాశపరిచింది.
ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 253.6 పాయింట్లు సాధించింది. చైనాకు చెందిన పెంగ్ గ్జిన్లు (253.0 పాయింట్లు) రెండో స్థానంలో వెండి, కొరియా షూటర్ వొన్ ఎనుజి (231.2 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకున్నారు.
Elavenil Valarivan becomes Asian Champion💫
The 26 y/o registered a score of 253.6 in the women’s 10m air rifle final to clinch GOLD🥇 ahead of China and South Korea at the Asian Shooting C’ships.
2⃣nd consecutive Asian individual medal for Elavanil –
🥈2024
🥇2025… pic.twitter.com/M76xMh0vIf— The Bridge (@the_bridge_in) August 22, 2025
తమిళనాడుకు చెందిన ఎలవనిల్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ కేటగిరీలో షిమ్కెంట్, మెహులి ఘోష్, అనన్యా నాయుడులతో కలిసి కాంస్యం సాధించింది. అయితే.. వ్యక్తిగత విభాగంలో అదిరే ప్రదర్శనతో బంగారు పతకం గెలుపొందింది ఎలవనిల్. ఇప్పటివరకూ ఈ ఛాంపియన్షిప్లో భారత షూటర్లు 10 పతకాలు అందుకున్నారు. ఇందులో మూడు స్వర్ణాలు, ఒక వెండి, ఆరు కాంస్యాలు ఉన్నాయి.