Paris Olympics | పారిస్: ఈజిప్టు రెజ్లర్ మహమ్మద్ ఎల్సయ్యద్పై పారిస్‌లో లైంగికదాడి కేసు నమోదైంది. శుక్రవారం ఒలింపిక్ విలేజ్ నుంచి బయటకు వచ్చిన ఎల్సయ్యద్పై అక్కడికి సమీపంలోనే ఉన్న ఓ కేఫ్‌లో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.