ఢిల్లీ: భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతో పాటు ప్రముఖ నటుడు సోనూ సూద్‌కు ఈడీ సమన్లు పంపింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ 1xBetను ప్రమోట్ చేసినందుకు గాను ఈడీ వీరికి సమన్లు అందజేసింది. ఈనెల 22న ఊతప్ప, 23న యువీ, 24న సోనూ సూద్ విచారణకు రావాలని ఆదేశించింది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద వీరి స్టేట్మెంట్స్ను రికార్డు చేయనున్నారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే సురేశ్ రైనా, శిఖర్ ధావన్నూ విచారించింది.