Durand Cup 2023 | కోల్‌కతా: ప్రతిష్ఠాత్మక డ్యురాండ్ కప్‌లో మోహన్‌బగాన్ సూపర్‌జెయింట్ భారీ విజయంతో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి మ్యాచ్‌లో మోహన్‌బగాన్ 5-0 తేడాతో బంగ్లాదేశ్ ఆర్మీ ఫుట్‌బాల్ టీమ్‌ను చిత్తుగా ఓడించింది.
మ్యాచ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మోహన్‌బగాన్ తరఫున లిస్టన్ కొలాకో (14ని), మన్వీర్సింగ్ (29ని), సుహైల్ అహ్మద్ (39ని), లాల్నిరలా హమ్టె (59ని), కియాన్ నాసిరి (89ని) గోల్స్ చేశారు.