టోక్యో : స్వీడన్ పోల్వాల్ట్ దిగ్గజం అర్మాండ్ మోండో డుప్లాంటిస్ తనకు తానే సాటి అని మరోమారు నిరూపించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో డుప్లాంటిస్ మరోమారు తన అద్భుత ప్రదర్శనతో ఏకంగా 14వ సారి వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
సోమవారం జరిగిన పురుషుల పోల్వాల్ట్ ఫైనల్లో బరిలోకి దిగిన డుప్లాంటిస్ ఏకంగా 6.30 మీటర్ల ఎత్తు దూకి పసిడి పతకాన్ని సగర్వంగా ముద్దాడాడు.