ముంబై: ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలైంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) గ్రౌండ్స్ వేదికగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 15 దాకా జరుగనుంది. ఒక సీజన్ విరామం తర్వాత మళ్లీ జోన్ల వారీగా జరుగబోయే ఈ టోర్నీలో ఆరు జట్లు (సౌత్, సెంట్రల్, వెస్ట్, ఈస్ట్, నార్త్, నార్త్ ఈస్ట్ జోన్) తలపడనున్నాయి.
సౌత్, వెస్ట్ జోన్ జట్లు నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించగా.. నార్త్ జోన్ X ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ X నార్త్ ఈస్ట్ జోన్ మధ్య క్వార్టర్స్ జరుగుతాయి. సెప్టెంబర్ 4 నుంచి 7 దాకా సెమీస్ మ్యాచ్‌లు, 11న ఫైనల్‌ను నిర్వహించనున్నారు. ఇదిలాఉండగా ఈ ఏడాది ఇరానీ కప్‌నకు విదర్భ ఆతిథ్యమివ్వనుంది. రంజీ ట్రోఫీ చాంపియన్స్ కావడంతో విదర్భకు ఇరానీ కప్ ఆతిథ్యం దక్కింది.