బెంగళూరు: దులీప్ ట్రోఫీలో సెమీస్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. వెస్ట్‌జోన్‌తో జరుగుతున్న రెండో సెమీస్‌లో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 118 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించి ఫైనల్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వెస్ట్ జోన్ 438 రన్స్‌కు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 229/2తో మూడో రోజు ఆట ఆరంభించిన ‘సెంట్రల్’కు శుభమ్ (96), కెప్టెన్ రజత్ పాటిదార్ (77), ఉపేంద్ర యాదవ్ (87), హర్ష్ దూబే (75) రాణించడంతో నాలుగో రోజు స్టంప్స్ సమయానికి ఆ జట్టు 556/8తో పటిష్ట స్థితిలో నిలిచింది.
ఇక సౌత్‌జోన్ కూడా ఫైనల్‌కు ఐదు వికెట్ల దూరంలో నిలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ నాలుగో రోజు ఆట చివరికి 278/5తో నిలిచింది. ఆ జట్టు ఓపెనర్ శుభమ్ ఖజురియా (128*) శతకంతో రాణించగా నిషాంత్ 82) కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టును ఆదుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్.. ఇంకా 258 పరుగులు వెనుకబడి (సౌత్‌జోన్ 536 ఆలౌట్) ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నార్త్, వెస్ట్ జోన్ జట్లు ఫైనల్ చేరడం కష్టమే.