IPL 2026: ఆకాశ్ దీప్, ఎడ్వర్డ్స్ స్థానాల్లో సౌరబ్ దూబే, పెయిన్
IPL 2026: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త ప్లేయర్లను ప్రకటించింది. గాయపడ్డ ఆకాశ్ దీప్ స్థానంలో సౌరబ్ దూబేను తీసుకుంటున్నట్లు కేకేఆర్ వెల్లడించింది. ఇక జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో డేవిడ్ పెయిన్‌ను తీసుకుంటున్నట్లు ఎస్ఆర్హెచ్ ప్రకటించింది.
న్యూఢిల్లీ: మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్(IPL 2026) ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో కొన్ని జట్లు గాయపడ్డ ప్లేయర్ల స్థానంలో కొత్త క్రికెటర్లను తీసుకున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త ప్లేయర్లను ప్రకటించింది. గాయపడ్డ ఆకాశ్ దీప్ స్థానంలో సౌరబ్ దూబేను తీసుకుంటున్నట్లు కేకేఆర్ వెల్లడించింది. ఇక జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో డేవిడ్ పెయిన్‌ను తీసుకుంటున్నట్లు ఎస్ఆర్హెచ్ ప్రకటించింది. భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్.. ఐపీఎల్ టోర్నీ నుంచి మొత్తానికి దూరం అయ్యాడు. అతను తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. బెంగుళూరులో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వైద్య బృందం సమక్షంలో అతను కోలుకోనున్నాడు.
Left-arm thunder, now dipped in purple and gold 💜
*Saurabh Dubey joins as a replacement for Akash Deep, as the latter has been ruled out of the TATA IPL 2026 season. We wish Akash Deep a speedy recovery.
[Ami KKR] pic.twitter.com/tfUt3eJmUd
— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026
ఆకాశ్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ సౌరభ్‌ను తీసుకున్నట్లు కేకేఆర్ ప్రకటించింది. 30 లక్షలకు అతను కేకేఆర్‌తో కలుస్తున్నాడు. 28 ఏళ్ల సౌరభ్.. విదర్భ జట్టు తరపున ఆడుతాడు. అయితే ఇప్పటి వరకు అతను ఐపీఎల్లో ఆడలేదు. తొలిసారి ఈ టోర్నీలో అరంగేట్రం చేయనున్నాడు. గతంలో అతను సన్‌రైజర్స్ బృందంలో ఉన్నాడు. ఇక ఇంగ్లండ్ పేసర్ పెయిన్ .. హైదరాబాద్ జట్టు తరపున ఆడనున్నాడు. పాదం గాయం వల్ల జాక్ ఎడ్వర్డ్స్ దూరం కాగా, అతని స్థానంలో పెయిన్‌ను తీసుకున్నారు.అయితే పెయిన్ కోసం ఎస్ఆర్హెచ్ 1.5 కోట్లు వెచ్చించింది.
Jack Edwards has been ruled out of the season due to injury. Get well soon, Jack! 🫶
David Payne has been named as the replacement player for TATA IPL 2026 🔥 pic.twitter.com/iD3F5oNkId
— SunRisers Hyderabad (@SunRisers) March 24, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Akash Deep
- Dubey
- Edwards
- ipl 2026
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

