దుబాయ్ : భారత టెన్నిస్ స్టార్ యుకీ భాంబ్రీ సత్తాచాటాడు. దుబాయ్ ఏటీపీ 500 టోర్నీలో అలెక్సీ పాప్రిన్తో కలిసి యుకీ డబుల్స్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో యుకీ, అలెక్సీ జోడీ 3-6, 7-6, 10-8తో ప్రపంచ 14వ ర్యాంక్ ద్వయం హ్యారీ హెలీవోరా, హెన్రీ ప్యాటెన్పై అద్భుత విజయం సాధించింది. 51 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో తొలి సెట్‌ను ప్రత్యర్థికి చేజార్చుకున్న యుకీ ద్వయం వరుస సెట్లలో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం ద్వారా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో యుకీ తన ర్యాంక్‌ను మరింత మెరుగుపర్చుకునే అవకాశముంది.