Rawalpindi : భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇవాళ మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పంజాబ్ (Punjab) సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాలపై పాకిస్థాన్ సైనికులు కవ్వింపులకు పాల్పడటంతో.. భారత్ ఎదురుదాడికి దిగింది. డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ఒక డ్రోన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రావల్పిండి (Rawalpindi) క్రికెట్ స్టేడియం (Cricket Stadium) ను ఢీకొట్టింది.
పాకిస్థాన్ సూపర్ లీగ్లో భాగంగా ఈ రాత్రి 8 గంటలకు పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇంతలో డ్రోన్ దాడి జరగడంతో మ్యాచ్ను రద్దు చేశారు. క్రికెటర్లను అక్కడి నుంచి వెనక్కి పిలిచారు. కాగా, పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే ధీటైన జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని భారత్ హెచ్చరిస్తున్నా లెక్కచేయలేదు. సరిహద్దుల్లో గురువారం ఉదయం నుంచి వరుస దాడులు చేసింది. దాంతో భారత్ ఎదురుదాడులు చేస్తోంది.