బుడాపెస్ట్: ఈ ఏడాది నవంబర్‌లో సింగపూర్ వేదికగా జరగాల్సి ఉన్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశే ఫేవరేట్ అని డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) వ్యాఖ్యానించాడు. బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న 45వ చెస్ ఒలింపియాడ్ సందర్భంగా లిరెన్ మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీలో గుకేశ్ చాలా బాగా ఆడుతున్నాడు. త్వరలో జరుగనున్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లోనూ అతడే ఫేవరేట్. ప్రస్తుతం అతడు నాకంటే ఎక్కువ రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్నాడు. గత ఏడాది కాలంగా నేను ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నా. కానీ రేటింగ్ వ్యత్యాసాన్ని తగ్గించేందుకు నేను శ్రమిస్తా’ అని అన్నాడు.