ట్యురిన్: సెర్బియా యోధుడు నోవాక్ జొకోవిచ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రికార్డును సమం చేస్తూ ఆరోసారి ఏటీపీ ఫైనల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7-5, 6-3తో మూడో సీడ్ కాస్పర్ రూడ్(నార్వే)పై అలవోక విజయం సాధించాడు. వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించిన జొకో.. ఏడేండ్ల తర్వాత తిరిగి టైటిల్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో 35 ఏండ్ల జొకోవిచ్ ఈ టైటిల్ నెగ్గిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కాడు. అంతేగాక టెన్నిస్ చరిత్రలో భారీ ప్రైజ్‌మనీ(రూ.38.38 కోట్లు) ఖాతాలో వేసుకున్నాడు. గత రెండు సీజన్లు టైటిల్ పోరుకు అర్హత సాధించిన జొకో..రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.