IPL 2026 Auction : పంతొమ్మిదో సీజన్ కోసం అబుధాబీలో నిర్వహించిన ఐపీఎల్ మినీ వేలంలో యువక్రికెటర్లు కళ్లు చెదిరే ధర పలికారు. ఆరంభంలోనే కామెరూన్ గ్రీన్ (రూ.25.20 కోట్లు), మథీశ పథిరన(రూ. 18కోట్లు)లు రికార్డు ధరకు అమ్ముడవ్వగా.. ఆ తర్వాత భారత కుర్రాళ్ల ప్రభంజనం కొనసాగింది. దేశవాళీలో అత్యుత్తమ ప్రదర్శనతో ఫ్రాంచైజీలను ఫిదా చేసిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ అత్యధిక ధర పలికిన అన్క్యాప్డ్ ప్లేయర్లుగా అవతరించారు. ఆఖర్లో లియాం లివింగ్‌స్టోన్‌ను రూ.13 కోట్లకు కొనేసింది ఆరెంజ్ ఆర్మీ. దాంతో.. అతడు టాప్-5లో చోటు సంపాదించాడు.
అంచనాలను తలకిందులు చేస్తూ అనామకులకు పట్టంకట్టిన ఐపీఎల్ వేలం ఆద్యంతం ఆసక్తి రేపింది. చేతినిండా డబ్బులతో కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్లు కామెరూన్ గ్రీన్, మతీశ పథిరనలను పట్టేసింది. దాంతో.. ఆరంభ సీజన్ నుంచి కొనసాగిన విదేశీ క్రికెటర్ల హవా ఈసారి కనిపించింది. అయితే.. ఆ తర్వాత నుంచి భారత యువకెరటాలు భారీ ధరతో వైరలయ్యారు.
నిండా పాతికేళ్లులేని కుర్రాళ్లు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ అబుధాబీలో హాట్‌కేకుల్లా అమ్ముడయ్యారు. రూ.30 లక్షల కనీస ధరతో యాక్షన్‌కు వచ్చిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు ఏకంగా రూ.14.2 కోట్లు కొల్లగొట్టారు. మధ్యప్రదేశ్ పేసర్ మంగేశ్ యాదవ్ ఏకంగా రూ.5.2కోట్లకు అమ్ముడయ్యాడు.
Presenting the Top 5⃣ buys of #TATAIPLAuction 2026 🙌
Which was your favourite bid? 🔨#TATAIPL pic.twitter.com/cBeFFZ9FKp
— IndianPremierLeague (@IPL) December 16, 2025
కామెరూన్ గ్రీన్ – రూ.25.20 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్
మథీశ పథిరన – రూ.18 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్
కార్తిక్ శర్మ – రూ.14.20 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్
ప్రశాంత్ వీర్ – రూ.14.20 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్
లియాం లివింగ్‌స్టోన్ – రూ.13 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్
Orange Army, make way for Liam Livingstone!🧡
He is sold to @SunRisers for INR 13 Crore 💰👏#TATAIPL | #TATAIPLAuction pic.twitter.com/YMo7f9joGP
— IndianPremierLeague (@IPL) December 16, 2025
కోల్‌కతా నైట్ రైడర్స్ : కామెరూన్ గ్రీన్(రూ.25.20 కోట్లు), మథీశ పథిరన(రూ.18 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్(రూ.9.20 కోట్లు), ఫిన్ అలెన్(రూ. 2కోట్లు).
సన్‌రైజర్స్ హైదరాబాద్ : లియాం లివింగ్‌స్టోన్ (రూ.13 కోట్లు), జాక్ ఎడ్వర్డ్స్ (రూ.3 కోట్లు), శివం మావి (75 లక్షలు)
చెన్నై సూపర్ కింగ్స్ : ప్రశాంత్ వీర్ (రూ.14.20 కోట్లు), కార్తిక్ శర్మ(రూ.14.20 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.20 కోట్లు), అకీల్ హోసేన్( రూ.2కోట్లు), మ్యాట్ హెన్రీ(రూ.2 కోట్లు), మాథ్యూ షార్ట్(రూ.1.50 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.75 లక్షలు), జాక్ ఫౌల్కెస్(రూ.75 లక్షలు) అమన్ ఖాన్ (రూ. 40లక్షలు)
ఢిల్లీ క్యాపిటల్స్ : అకీబ్ దార్(రూ.8.40కోట్లు), కైలీ జేమీసన్(రూ.2 కోట్లు), బెన్ డకెట్‌ను రూ.2 కోట్ల) పృథ్వీ షా(రూ.75 లక్షలు)
గుజరాత్ టైటాన్స్ : జేసన్ హోల్డర్(రూ.7 కోట్లు), టామ్ బ్యాంటన్(రూ.2 కోట్లు), అశోక్ శర్మ(రూ.90 లక్షలు) ల్యూక్ వుడ్(రూ.75 లక్షలు), పృథ్వీరాజ్ ఎర్రా(రూ.30లక్షలు).
పంజాబ్ కింగ్స్ : బెన్ ద్వారుషి(రూ.4.60 కోట్లు), కూపర్ కొన్నొలీ(రూ.3 కోట్లు), విశాల్ నిషద్(రూ.30 లక్షలు), ప్రవీణ్ దూబే(రూ.30 లక్షలు)
ముంబై ఇండియన్స్ : క్వింటన్ డికాక్(రూ. 1 కోటి), అథర్వ అంకొలేకర్.
లక్నో్ సూపర్ జెయింట్స్ : జోష్ ఇంగ్లిస్ (రూ.8.50 కోట్లు), ముకుల్ చౌదరీ(రూ.2.6 కోట్లు), అక్షత్ రఘువంశీ(రూ.2.2కోట్లు) అన్రిచ్ నోర్జి(రూ.2కోట్లు), వనిందు హసరంగ(రూ.2 కోట్లు), నమన్ తివారీ(రూ. 1కోటి)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : వెంకటేశ్ అయ్యర్ (7.20 కోట్లు), మంగేశ్ యాదవ్(రూ.5.20కోట్లు), జాకబ్ డఫ్ఫీ(రూ.2 కోట్లు), జ ఓర్డాన్ కాక్స్(రూ.75 లక్షలు), వికీ ఒత్స్వాల్(రూ.30 లక్షలు), కనిష్క చౌహన్(రూ.30 లక్షలు), విహాన్ మల్హోత్రా(రూ.30లక్షలు),
రాజస్థాన్ రాయల్స్ : రవి బిష్ణోయ్(రూ. 7.20కోట్లు), విఘ్నేష్ పుతూర్, రవి సింగ్, సుశాంత్ మిశ్రా, కుల్దీప్ సేన్, యశ్ రాజ్ పంజా, ఆడం మిల్నే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంపై భారీ ఆశలు పెట్టుకున్న క్రికెటర్లకు ఊహించని షాకిచ్చాయి ఫ్రాంచైజీలు. గతంలో మ్యాచ్ విజేతలుగా పేరొందిన బెయిర్‌స్టో, డెవాన్ కాన్వే, రహ్మనుల్లా గుర్బాజ్ వంటి హిట్టర్లను కనీస ధరకు కూడా ఎవరూ కొనలేదు. తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్‌ను సైతం వదిలేశారు. ఇక భారత అన్క్యాప్డ్ ప్లేయర్లలో శివం మావి, మహిపాల్ లొమ్రోర్, అన్మోల్ప్రీత్ సింగ్.. తదితరులు వేలంలో అమ్ముడుపోలేదు.
భారత క్రికెటర్లు : విజయ్ శంకర్, ఆకాశ్ దీప్, సిమర్జిత్ సింగ్, రాజ్ లింబానీ, తుషార్ రహేఉజా, రుచిత్ అహిర్, సన్వీర్ సింగ్, కమలేష్ నగర్కొటి, తనుష్ కొతియాన్, మహిపాల్ లోమ్రోర్, రాజ్వర్ధన్ హంగ్రేకర్, ఈడెన్ టామ్, ఆర్య దేశాయ్, యశ్ ధుల్, అభినవ్ మనోహర్, అన్మోల్ప్రీత్ సింగ్, అభినవ్ తెజ్రన, అథైర్వ తైడే, శివం మావి, కేఎస్ భరత్, దీపక్ హుడా, కుమార్ కార్తికేయ సింగ్, విఘ్నేష్ పుతూర్,
ఆస్ట్రేలియా క్రికెటర్లు : ఫ్రేజర్ మెక్‌గుర్క్, స్పెన్సర్ జాన్సన్.
న్యూజిలాండ్ క్రికెటర్ : డెవాన్ కాన్వే.
ఇంగ్లండ్ క్రికెటర్లు : జానీ బెయిర్‌స్టో, జేమీ స్మిత్, గస్ అట్కిన్సన్.
అఫ్గనిస్థాన్ క్రికెటర్లు : ముజీబ్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారూకీ, రహ్మనుల్లా గుర్బా్జ్.
దక్షిణాఫ్రికా క్రికెటర్లు: గెరాల్డ్ కొయెట్జీ, వియాన్ మల్డర్.