Olympics | ఆ విషయంలో అమెరికా, జపాన్ కంటే మనమే బెటర్
నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఆటల పండుగ !! జీవితంలో ఒక్కసారైనా ఈ విశ్వ క్రీడల్లో ఆడాలని ప్రతి అథ్లెట్ కలలు కంటాడు !! పతకం గెలవడం కోసం రాత్రింబవళ్లు ఎంతో శ్రమిస్తాడు !! ఒక ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే వాళ్లు పుట్టిన దేశాలు ఎంతో గౌరవిస్తాయి.

ఒలింపిక్స్.. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఆటల పండుగ !! జీవితంలో ఒక్కసారైనా ఈ విశ్వ క్రీడల్లో ఆడాలని ప్రతి అథ్లెట్ కలలు కంటాడు !! పతకం గెలవడం కోసం రాత్రింబవళ్లు ఎంతో శ్రమిస్తాడు !! ఒక ఒలింపిక్స్‌లో పతకం గెలిస్తే వాళ్లు పుట్టిన దేశాలు ఎంతో గౌరవిస్తాయి. తమ దేశ ప్రతిష్టను పెంచిన క్రీడాకారులకు నగదు బహుమతులు, అవార్డులను ప్రకటిస్తుంటాయి. ఇలా పతకాలు గెలిచిన ఆటగాళ్లకు కోట్ల రూపాయలు బహుమతిగా ఇవ్వడం గతంలో చూసే ఉంటారు. అయితే కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఒలింపిక్స్‌లో గెలిచిన క్రీడాకారులకు నగదు పురస్కారాలు అందజేస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో అయితే ఒక చట్టం ప్రకారం ఎప్పటి నుంచో ఈ బహుమతులు అందిస్తున్నాయి. మిగిలిన దేశాలు మాత్రం తమకు తోచినంత పురస్కారం అందజేస్తున్నాయి.
భారత్ నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో 127 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చే వారికి నగదు పురస్కారం అందజేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. స్వర్ణ పతకానికి రూ.75 లక్షలు, రజత పతకానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షల నగదును బహుమతిగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఛండీగఢ్ రాష్ట్రాలు కూడా నగదు పురస్కారాలను ప్రకటించాయి. గోల్డ్ మెడల్ గెలిస్తే రూ.6 కోట్లు, సిల్వర్ గెలిస్తే రూ.4 కోట్లు, బ్రాంజ్ గెలిస్తే రూ.2.5కోట్లు బహుమతిగా ఇవ్వనున్నాయి. కర్ణాటక, గుజరాత్ రాష్ట్ర ప్రబుత్వాలు అయితే గోల్డ్ మెడల్ గెలిచిన అథ్లెట్‌కు రూ.5 కోట్లు ఇస్తామని ప్రకటించింది. ఇక ఏ రాష్ట్రానికి చెందిన అథ్లెట్‌కి అయినా సరే గోల్డ్ మెడల్ గెలిస్తే రూ.3 కోట్లు ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
ప్రపంచ దేశాలతో పోలిస్తే పతకాలు గెలిచిన క్రీడాకారులకు అత్యధికంగా నగదు పురస్కారం భారత్‌లోనే అందిస్తున్నారు. ఈ సారి ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న జపాన్.. పతకాలు తెచ్చే వారికి రూ. 34 లక్షలనే బహుమతిగా ఇవ్వనుంది. బ్రిటన్, నార్వే, స్వీడన్ దేశాలు మాత్రం అథ్లెట్లకు ఒక్క రూపాయి కూడా పురస్కారం అందించడం లేదు. నగదు పురస్కారాలకు బదులుగా ఒలింపిక్స్‌కు శిక్షణ పొందే క్రీడాకారుల కోసం ఏటా 160 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి.
ఇక ఏ దేశం ఎంత నగదు పురస్కారం ఇస్తున్నదంటే..
| దేశం | నగదు బహుమతి | దేశం | నగదు బహుమతి |
| ఇండోనేషియా | 5.55 కోట్లు | రష్యా | 45 లక్షలు |
| సింగపూర్ | 5.47 కోట్లు | బ్రెజిల్ | 35 లక్షలు |
| హాంకాంగ్ | 4.80 కోట్లు | అమెరికా | 28 లక్షలు |
| థాయిలాండ్ | 2.30 కోట్లు | దక్షిణాఫ్రికా | 27.5 లక్షలు |
| కజికిస్తాన్ | 1.86 కోట్లు | నెదర్లాండ్స్ | 26 లక్షలు |
| ఇటలీ | 1.58 కోట్లు | జర్మనీ | 16 లక్షలు |
| జపాన్ | 75 లక్షలు | కెనడా | 12 లక్షలు |
| ఫ్రాన్స్ | 48 లక్షలు | ఆస్ట్రేలియా | 11 లక్షలు |
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mira bhai chanu |మీరాబాయి చాను చెవి రింగుల కథ తెలుసా.. తల్లి కష్టం వృథా పోలేదు
Chanu Mirabai | మీరాబాయ్ చాను.. కట్టెలు మోసిన చేతులే సిల్వర్ మెడల్ తీసుకొచ్చాయి
Tokyo Olympics: సూపర్ వుమన్ మీరాబాయ్పై ప్రశంసల వెల్లువ
Tokyo Olympics: తొలి గోల్డ్ మెడల్ చైనా ఖాతాలో.. ఇండియన్ షూటర్లు ఫెయిల్
Tokyo Olympics : ఈ ఏడుగురు వనితల్లో స్వర్ణం తెచ్చేదెవరో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

