హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత వెటరన్ ఫుట్‌బాల్ ప్లేయర్ డీఎంకే అఫ్జల్‌కు సాట్స్ అండగా నిలిచింది.ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అఫ్జల్‌కు సాట్స్ తరఫున రూ.3లక్షల ఆర్థిక సాయం అందజేశారు. బుధవారం గొల్కోండ రిసాల బజార్‌లోని అఫ్జల్ ఇంటికి స్వయంగా వెళ్లిన సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనీబాలదేవి ఆయన కుటుంబసభ్యులకు చెక్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో భారత మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్లు షబ్బీర్ అలీ, విక్టర్ అమల్‌రాజ్ పాల్గొన్నారు. 1962 జకార్తా ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన భారత జట్టులో అఫ్జల్ సభ్యుడు.