Novak Djokovic : పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లలో రికార్డు సృష్టించిన నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) మరో ట్రోఫీ వేటకు వస్తున్నాడు. వింబుల్డన్‌లో విఫలమైన జకో ఈసారి యూఎస్ ఓపెన్ (US Open)లో తన తడాఖా చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. మెగా టోర్నీ సన్నాహకాల్లో బిజీగా ఉన్న జోకర్ ఒక చిన్నారి అభిమానితో సరదాగా మాట్లాడాడు. టెన్నిస్ కోర్టులోకి వెళ్తున్న ఆటగాళ్లందరికీ నిమ్మరసం (Lemonade) ఇస్తున్న ఆ చిన్ని అమ్మాయితో మాట్లాడుతున్నంత సేపు చిన్నపిల్లాడిలా మారిపోయాడీ సెర్బియా స్టార్.
జకోవిచ్ వెళ్తుండగా.. ‘హలో.. మీ నిమ్మరసం తీసుకోండి’ అని స్టాల్‌లోని ఎమిరే అంటుంది. ఆమెను చూసి దగ్గరకు వచ్చిన జకో ‘హాయ్ ఎలా ఉన్నావు?’ అని అడుగుతాడు. ‘నేను బాగున్నాను’ అని ఎమిరే సమాధానం చెబుతుంది. ‘నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది. నీ పేరేంటీ?’ అని జకో ప్రశ్నించగా.. ‘ఎమిరే’ అని జవాబిస్తుంది తను. ఆ తర్వాత ఇద్దరూ టెన్నిస్ గురించి మాట్లాడుకుంటారు. ‘నేను మీకు పెద్ద అభిమానిని’ అని ఎమిరే అనగానే ‘ఓ.. థ్యాంక్యూ’ అంటాడు టెన్నిస్ స్టార్. ‘నీకు టెన్నిస్ ఇష్టమా.. ఆడుతావా?’ అని అతడు అడిగగా.. ముద్దుముద్దు మాటలతోగా ‘అవును’ అని చెబుతుందా చిన్నారి.
The cutest of interactions 🥰
Emerie gets to serve lemonade to her favourite tennis player – none other than @DjokerNole… pic.twitter.com/aUODLEtkR5
— US Open Tennis (@usopen) August 22, 2025
‘యూఎస్ ఓపెన్ మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తిగా ఉన్నావా?’ అని జకో ప్రశ్నించగా అవునంటుంది. ‘ఎవరి ఆట చూడాలనుకుంటున్నావు’ అని అడిగితే.. ‘ఇంకెవరు మీ ఆటే చూడాలని ఉంది’ అని ఠక్కున చెప్పేస్తుంది చిన్నారి. ‘నవామి ఒసాకి, అరినా సబలెంక మ్యాచ్‌లు కూడా చూస్తాను’ అని ఎమరే చెప్పింది. ‘ఓకే.. థాంక్యూ’ అని జకో అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వీడియో ముగుస్తుంది. టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ చాలా సరదాగా ఎమిరేతో మాట్లాడుతున్న వీడియోను యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అల్కరాజ్, జన్నిక్ సినర్
రెండేళ్ల క్రితం ఇక్కడే 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుపొందిన జకో.. ఈసారి పక్కా ప్లాన్‌తో ఉన్నాడు. టాప్ సీడ్లు కార్లోస్ అల్కరాజ్, జన్నిక్ సినర్లను దాటి మరో గ్రాండ్‌స్లామ్ ఖాతాలో వేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నాడీ వెటరన్. కానీ, సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ కుర్రాళ్లిద్దరూ జకోకు చెక్ పెట్టేందుకు ఎదురుచూస్తున్నారు.