న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో జరిగే టోర్నీల్లో కచ్చితంగా 90 మీటర్ల మార్క్‌ను అందుకుంటానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న నీరజ్ సన్నాహాల్లో నిమగ్నమయ్యాడు. ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ అండర్ ఆర్మర్‌కు నీరజ్ చోప్రా బ్రాండ్ అంబాసీడర్‌గా ఎంపికయ్యాడు. సోమవారం ఏర్పాటు చేసిన వర్చువల్ మీడియా భేటీలో మాట్లాడుతూ అండర్ ఆర్మర్‌తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది అన్నాడు.