పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమంలో భారత అథ్లెట్లు ధరించిన దుస్తులపై సోషల్‌మీడియాలో విమర్శల జడివాన కురుస్తున్నది. సీన్ నదిపై బోట్‌పై భారత ప్లేయర్లు జాతీయ జెండాలు పట్టుకుని అభివాదం చేస్తున్న డ్రెస్‌ల డిజైన్‌పై పలువురు పెదవి విరుస్తున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్యాని మూడు రంగుల జెండా డిజైన్‌తో ఇక్కత్‌తో రూపొందించాడు. అయితే ఇం దుకు వాడిన దుస్తుల నాణ్యతపై పలువురు తరుణ్‌పై సోషల్‌మీడియాలో తమదైన శైలిలో అరుసుకున్నారు. దేశం దృష్టిని ఆకర్షించాల్సిన డిజైన్ ఇలా ఉంటుందా అంటూ ఒకరు ప్రశ్నించగా, అంబానీ పెండ్లికి చేసిన డిజైన్లతో పోల్చుకుంటే ఇవి చాలా ఆధ్వానంగా ఉన్నాయంటూ సూటిగా విమర్శించారు. ఇదే డ్రెస్ ముంబై రోడ్లపై 200లకు తెస్తానంటూ ఒకరు కామెంట్ చేశారు. అయితే తన డిజైన్‌పై తరుణ్ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు.