ఒస్లో(నార్వే): నార్వే చెస్ టోర్నీ ఆరో రౌండ్లో భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, గుకేశ్, కోనేరు హంపి, దివ్యాదేశ్ముఖ్ ఓటమిపాలయ్యారు. ఓపెన్ విభాగంలె గుకేశ్ .. జర్మనీ యువ సంచలనం విన్సెంట్ కెమెర్ చేతిలో, ప్రజ్ఞానంద.. టేబుల్ టాపర్ వెస్లె సో(అమెరికా) చేతిలో ఓటమి చవిచూశారు. టైటిల్ ఫెవరేట్ కార్ల్సన్.. అలీరెజా ఫిరౌజా (ఫ్రాన్స్)ను ఓడించి ముందంజ వేశాడు. మహిళల విభాగంలో దివ్య ..జు వెన్జున్(చైనా) చేతిలో పరాజయం పాలైంది. అసబయెవా.. భారత దిగ్గజం హంపిపై నెగ్గింది.