ACB Notice | 19 మంది డీఎస్పీలకు ఏసీబీ నోటీసులు.. సినీ హీరోకూ నోటీసులిచ్చే అవకాశం!
ACB Notice | డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ చర్యలు చేపట్టింది. భీంరెడ్డితో ఆర్థిక, వ్యాపార సంబంధాలున్న దాదాపు 19 మంది డీఎస్పీలకు నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ACB Notice | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ చర్యలు చేపట్టింది. భీంరెడ్డితో ఆర్థిక, వ్యాపార సంబంధాలున్న దాదాపు 19 మంది డీఎస్పీలకు నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొంతమంది డీఎస్పీలను నేరుగా ఏసీబీ తన ఆఫీసుకు పిలిచి విచారించనున్నదని విశ్వసనీయ సమాచారం. ఆయా డీఎస్పీలు భీమ్‌రెడ్డి సూచించిన రియల్ఎస్టేట్ వ్యాపారాలు, కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, కొందరు నేరుగా భూములు కొనుగోలు చేశారని తెలిసింది. వెలుగులోకి వచ్చిన కొత్త ప్లాట్లు, ఫ్లాట్లతో నోటీసులు అందుకున్న డీఎస్పీలకు సంబంధాలు ఉన్నట్టు సమాచారం. దీని పై ఇప్పటికే డీఎస్పీ శ్రీనాథ్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి.. వివరణ కోరినట్టు తెలిసింది. కాగా, మీడియాకు అందుతున్న సమాచారం పట్ల డీజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది.
బినామీలకు కూడా నోటీసులు
డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి బినామీలుగా ఉన్న దాదాపు 15 మందికి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎవరెవరు ఏయే ఆస్తులకు బినామీగా ఉన్నారనే వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించారు. భీంరెడ్డి ఇంట్లో, బంధువుల ఇండ్లలో దొరికిన ఆధారాలతో మరికొంతమంది బినామీలను గుర్తించినట్టు తెలిసింది. ఏసీబీ గుర్తించిన బినామీలలో.. సింగవరపు శ్రీనివాసరావు (భీంరెడ్డికి ప్రధాన ఆర్థిక బినామీ), ప్రవీణ్‌కుమార్ ఆలూరి (ఆదిత్య హౌసింగ్ ప్రవేట్ లిమిటెడ్), తిరుపతిరెడ్డి అభిషేక్‌రెడ్డి, సింగవరపు లక్ష్మి (భీంరెడ్డి భార్య), శ్రావణిరెడ్డి, తాటిపర్తి ఇంద్రకరణ్‌రెడ్డి (బంధువు), హరిప్రియ జయమ్మ (భీంరెడ్డి సోదరి), శ్రీనివాసన్, సాయి నితిన్, హోంగార్డు లక్ష్మణ్, మంజుగౌడ్, సరిత, రవి నార్వ, వరంగల్ జిల్లాకు చెందిన బిల్డర్ ప్రజాపతి, సర్వేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సురేశ్‌కు ఆస్తుల వివరాలు తెలుపాలంటూ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.
టాలీవుడ్ హీరోకు సైతం
భీమ్‌రెడ్డి కేసులో ప్రముఖ ఓ టాలీవుడ్ నటుడికి ఏసీబీ అధికారులు నోటీసులిచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఓ ఇల్లు కొనుగోలు విషయంలో కొంత డబ్బు చెల్లించిన ఆ నటుడికి ఇల్లు పూర్తిస్థాయిలో అందలేదు. దీంతో అతని పేరును భీమ్‌రెడ్డి తన డైరీలో రాసుకోవడంతో ఏసీబీ అధికారులు లావాదేవీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునేందుకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. తెలుగు రాష్ర్టాల్లో టీవీ రంగంలో సుపరిచితమైన సంస్థగా పేరొందిన ఓ కంపెనీతో కూడా భీమ్‌రెడ్డి కుటుంబీకులకు వ్యాపార సంబంధాలు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

