లక్నో: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ, లక్నో సూపర్ గెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రాథీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఐపీఎల్(IPL 2025)లో సోమవాం ఈ ఘటన చోటుచేసుకున్నది. దూకుడు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న అభిషేక్ కేవలం 20 బంతుల్లో 59 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే దిగ్వేశ్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో .. శార్దూల్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ వెనుదిరిగాడు. ఆ సమయంలో తనదైన సిగ్నేచర్ స్టయిల్లో దిగ్వేశ్ సెలబ్రేషన్ చేసుకున్నాడు. పెవిలియన్‌కు వెళ్తున్న అభిషేక్ వైపు చూస్తూ .. తన సెలబ్రేషన్ సంకేతాలు చేశాడు. దీంతో డగౌట్ వెళ్తున్న అభిషేక్.. బౌలర్ దిగ్వేశ్ వైపు వచ్చాడు. ఇద్దరూ తీవ్రంగా వాదులాడుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు అంపైర్లు, ఆటగాళ్లు కలగచేసుకుని, ఆ ఇద్దర్నీ వేరు చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
A heated argument between Abhishek Sharma and Digvesh Rathi.🔥🔥
#LSGvsSRH #SRHvsLSG#DigveshRathi#AbhishekSharma pic.twitter.com/8lPkV7jAr5
— Kalyani Nirbhawane 🇮🇳 (@KalyaniAmbedkar) May 19, 2025
ఇక ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్ నిష్క్రమించింది. సోమవారం మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) చేతిలో లక్నో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 205 రన్స్ చేసింది. ఓపెనర్లు మార్ష్ (39 బంతుల్లో 65, 6 ఫోర్లు, 4 సిక్సర్లు), మార్క్మ్ (38 బంతుల్లో 61, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారానికి తోడు నికోలస్ పూరన్ (26 బంతుల్లో 45, 6 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులతో 20 ఓవర్లలో లక్నో 205/7 స్కోరు చేసింది. హైదరాబాద్ 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకున్నది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 59, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో హైదరాబాద్ విజయంలో కీలకమయ్యాడు.
Today again I wrote a notebook Author: “Digvesh Rathi”
Can anyone tell me how much the fine is today? 💸💲
“Abhishek Sharma” #LSGvsSRH #War2 #HappyBirthdayNTR Cricbuzz “Sanjiv Goenka” Digvesh Rathi “Jill Biden” Covid “Rishabh Pant” “ADULT YOU” Lucknow pic.twitter.com/jEV1QFjbJR
— Anamika Hazarika (SUMU) (@Anamika1344202) May 19, 2025