లక్నో: టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ (132 బంతుల్లో 113 నాటౌట్, 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకానికి తోడు దేవ్‌దత్ పడిక్కల్ (86 నాటౌట్) రాణించడంతో ఆస్టేలియా ‘ఏ’తో లక్నోలో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత్ ‘ఏ’ జట్టు దీటుగా బదులిస్తున్నది.
మూడో రోజు 116/1తో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. ఆట ముగిసే సమయానికి 403/4 రన్స్ చేసింది. ఆరంభంలో జగదీశన్ (64), సాయి సుదర్శన్ (73) ద్వయం ఆసీస్ బౌలర్లను నిలువరించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (8) నిరాశపరిచినా పడిక్కల్‌తో కలిసి జురెల్ జట్టును ఆడుకున్నాడు.