హైదరబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : అఖిల భారత లాన్‌టెన్నిస్ చాంపియన్ షిప్లో స్వర్ణ పతకం గెలిచిన ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి బృందాన్ని డీజీపీ డాక్టర్ జితేందర్ అభినందించారు. మంగళవారం హైదరాబాద్‌లో చంద్రవశేఖర్రెడ్డి టీమ్..డీజీపీని కలిసింది. ప్రతిష్ఠాత్మక టోర్నీలో పసిడి పతకం గెలువడం సంతోషంగా ఉందని వారిని డీజీపీ అభినందించారు. నవంబర్ 26 నుంచి 30 వరకు బెంగళూరులో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్, పారామిలటరీ బలగాల కోసం ఈ టోర్నీని నిర్వహించారు. టెన్నిస్ డబుల్స్ ఫైనల్లో ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఎస్పీ రియాజ్ జోడీ..ఏపీకి చెందిన రామ్‌కుమార్, సత్యనారాయణ ద్వయంపై స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.