చెన్నై: దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ ఐపీఎల్-18లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు ఆడనున్నాడు. గాయపడ్డ పేసర్ గుర్జప్నీత్ సింగ్ స్థానాన్ని బ్రెవిస్తో భర్తీ చేయనున్నట్టు సీఎస్కే తమ సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించింది.
21 ఏండ్ల బ్రెవిస్.. 2022, 2024 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున 10 మ్యాచ్లు ఆడాడు. ఇక ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గాయపడ్డ గ్లెన్ ఫిలిప్స్ స్థానాన్ని గుజరాత్ టైటాన్స్.. శ్రీలంక ఆల్రౌండర్ దసున్ శనకతో భర్తీ చేసింది.