ప్రస్తుతం ఒక్క భారత్ మాత్రమే కాదు… యావత్ ప్రపంచం ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. ఇండియా, న్యూజిలాండ్ మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్‌కు వెళ్లాలంటే రెండు జట్లకు గెలుపు చాలా అవసరం. అందుకే ఈ మ్యాచ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. భారత క్రికెట్ అభిమానులు అయితే ఇప్పటికే టీవీ ఆన్ చేసి.. ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
అయితే.. ఈ మ్యాచ్‌లో కూడా టాస్ గెలవడం మీదనే మ్యాచ్ ఆధారపడి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు దుబాయ్ స్టేడియంలో టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా 20 మ్యాచ్‌లు జరిగితే అందులో 14 మ్యాచ్‌లలో టాస్ గెలిచి.. ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లే గెలిచాయి. అంటే.. టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా ఈసారి కూడా ఫీల్డింగే ఎంచుకునే అవకాశం ఉంది. ఛేజింగ్ ఈ స్టేడియంలో ఈజీ అవుతోంది.
మొన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారత్.. టాస్ ఓడిపోవడమే పెద్ద మైనస్‌గా మారింది. టాస్ గెలిచిన పాక్.. ఫీల్డింగ్ ఎంచుకొని ఈజీగా ఛేజ్ చేసింది. అందుకే.. ఈ మ్యాచ్‌లో కూడా టాస్ అనేది చాలా కీలకంగా మారింది.
అయితే.. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో టాస్ ఎందుకు కీలకంగా మారుతోందంటే.. రాత్రి అవుతున్నా కొద్దీ అక్కడ డ్యూ ఫ్యాక్టర్ సమస్య ఉత్పన్నం అవుతోంది. స్టేడియంలోని గడ్డి మీద తేమ ఎక్కువవడంతో బౌలింగ్ సరిగ్గా పడదు. దాని వల్ల.. బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా బంతి మారడం వల్ల ఛేదన అనేది ఈజీ అయిపోతోంది. అందుకే.. డ్యూ ఫ్యాక్టర్‌ను దృష్టిలో పెట్టుకొని టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంటోంది.
Hello from Dubai for #TeamIndia's #T20WorldCup clash against New Zealand 👋
— BCCI (@BCCI) October 31, 2021
📸 A look at the pitch for the #INDvNZ contest 🔽 pic.twitter.com/9jHSR7xsqA