NZW vs SAW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో బోణీ కొట్టాలనే కసితో ఉన్న న్యూజిలాండ్ రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. టాపార్డర్ శుభారంభం ఇవ్వడంతో కెప్టెన్ సోఫీ డెవినె (55 నాటౌట్) అర్ధ శతకంతో స్కోర్‌బోర్డును ఉరికిస్తోంది. దక్షిణాఫ్రికా బౌలర్లను ఉతికేస్తున్న ఆమెకు బ్రూక్ హల్లిడే (38 నాటౌట్) చక్కని సహకారం అందిస్తుండడంతో కివీస్ స్కోర్ 160 దాటింది. వీరిద్దరూ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. 35 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
ఇండోర్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. అయితే.. మొదటి ఓవర్లోనే ఓపెనర్ సుజీ బేట్స్ (0)వికెట్ పడింది. మరినే కాప్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఆమె ఎల్బీగా వెనుదిరిగింది. ఆ తర్వాత జార్జియా పిమ్మర్(31), ఆల్‌రౌండర్ అమేలియా కేర్(23)లు రెండో వికెట్‌కు 44 రన్స్ జోడించారు. దాంతో.. కివీస్ ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్నారంతా. కానీ..పవర్ ప్లే తర్వాత చొలే ట్రయాన్ బౌలింగ్‌లో అమేలియాను ఔట్ అయింది. అనంతరం పిమ్మర్, కెప్టెన్ సోఫీ డెవినె(55 నాటౌట్) జట్టు స్కోర్ సెంచరీ దాటించారు.
𝐃𝐫𝐞𝐚𝐦 𝐬𝐭𝐚𝐫𝐭 𝐟𝐨𝐫 𝐒𝐨𝐮𝐭𝐡 𝐀𝐟𝐫𝐢𝐜𝐚 & 𝐌𝐚𝐫𝐢𝐳𝐚𝐧𝐧𝐞 𝐊𝐚𝐩𝐩! 🔥
Suzie Bates, playing her 350th international, departs for a golden duck!#CricketTwitter #CWC25 #NZvSApic.twitter.com/YsCIGzRtyN
— Female Cricket (@imfemalecricket) October 6, 2025
పిమ్మర్ వెనుదిరిగాక బ్రూక్ హల్లిడే(38 నాటౌట్) సాయంతో జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకుంది డెవినె. సమయోచితంగా ఆడిన ఈ ఇద్దరూ సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. కాస్త కుదురుకున్నాక బౌండరీలతో విరుచుకుపడిన ఈ ద్వయం స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించింది. ఆస్ట్రేలియాపై కూడా హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన డెవినె, హల్లిడే దక్షిణాఫ్రికాపై కూడా ఫిఫ్టీ రన్స్‌తో చెలరేగారు. దాంతో.. వైట్ ఫెర్న్స్ టీమ్ 35 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 164 రన్స్ కొట్టింది. ఇంకా.. 15 ఓవర్లు ఉండడంతో స్కోర్ అలవోకగా 250 దాటేలా ఉంది.