INDW vs PAKW : వరల్డ్ కప్ రెండో మ్యాచ్‌లో అర్ధ శతకానికి చేరువైన హర్లీన్ డియోల్ (46) పెద్ద షాట్‌కు యత్నించి ఔటయ్యింది. రమీమ్ షమీమ్ ఓవర్లో మిడాన్‌లో సిక్సర్‌కు కొట్టాలనుకున్న డియోల్ బౌండరీ వద్ద నష్ర చేతికి చిక్కింది. దాంతో, నాలుగో వికెట్ కీలక భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం జెమీమా రోడ్రిగ్స్ (28 నాటౌట్), దీప్తి శర్మ(2 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. 34 ఓవర్లకు భారత్ 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ స్మృతి మంధాన(23) పవర్ ప్లేలోనే వెనుదిరిగినా.. హర్లీన్ డియోల్ (46), ప్రతీకా రావల్ (31)జట్టు స్కోర్ 60 దాటించారు. అయితే.. జోరు పెంచే క్రమంలో సాదిక్ ఇక్బాల్ వేసిన16వ ఓవర్లో ప్రతీకా బౌల్డ్ అయింది. దాంతో.. 67 వద్ద టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
A fine knock from Harleen Deol comes to an end 👏
1⃣5⃣0⃣ up for #TeamIndia as Deepti Sharma joins Jemimah Rodrigues at the crease 🤜🤛
Updates ▶ https://t.co/9BNvQl3bfB#WomenInBlue | #CWC25 | @imharleenDeol | @JemiRodrigues pic.twitter.com/qOX82U82Nd
— BCCI Women (@BCCIWomen) October 5, 2025
అనంతరం జట్టును ఆదుకోవాలనుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(19)ను డయనా వెనక్కి పంపింది. మూడు వికెట్లు పడిన దశలో జెమీమా రోడ్రిగ్స్ (28 నాటౌట్), డియోల్ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. డయానా ఓవర్లో గ్లోవ్స్ తాకిన బంతిని విక ఎట్ కీపర్ డైవ్ చేస్తూ అందుకుంది. కానీ, అది నో బాల్ కావడంతో జెమీమా బతికిపోయింది. ఆ తర్వాత ఆచితూచి ఆడిన జెమీమా.. డియోల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 45 పరుగుల రాబట్టింది. అయితే.. రమీమ్ ఓవర్లో పెద్ద షాట్ ఆడిన డియోల్ బౌండరీలైన్ దగ్గర నష్ర క్యాచ్ పట్టడంతో వెనుదిరిగింది.