Deodhar Trophy: ఐపీఎల్ 16వ సీజన్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023) ముగిశాయి. దాంతో, భారత దేశవాళీ క్రికెట్(Domestic Cricket) ఊపందుకోనుంది. అయితే.. ఈసారి దేవ్ ధర్ ట్రోఫీ(Deodhar Trophy) కూడా ఉండనుంది. అవును.. 2023-24 సీజన్లో మళ్లీ దేవ్‌ధర్ ట్రోఫీ మొదలవ్వనుంది. చివరిసారిగా ఈ టోర్నీని 2019లో నిర్వహించారు. దాంతో, నాలుగేళ్ల తర్వాత జరగనున్న ఈ ట్రోఫీకి పుదుచ్చేరి వేదిక.
ఇందులో ఆరు జోనల్ టీమ్స్(నార్త్, ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, సౌత్, నార్త్ ఈస్ట్) పాల్గొననున్నాయి. అయితే.. ఈ టోర్నీ ఏ రోజు ప్రారంభమయ్యే రోజు, ఫైనల్ తేదీని ఇంకా వెల్లడించలేదు. అయితే.. జూలై 24 నుంచి ఆగష్టు 3వ తేదీ వరకు జరగనుంది.
దేవ్‌ధర్ ట్రోఫీలో 50 ఓవర్ల ఆట ఉంటుంది. దులీప్ ట్రోఫీ(Duleep Trophy) తర్వాత ఈ ట్రోఫీని నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. దులీప్ ట్రోఫీ జూన్ 28 నుంచి జూలై 16వ వరకు జరగనుంది. గత ఏడాది ఆతిథ్యం ఇచ్చిన బెంగళూరులోనే ఈ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఆరు జోన్లకు సంబంధించిన జట్లను జూన్ 15న ప్రకటిస్తామని బీసీసీఐ జనరల్ మేనేజర్(గేమ్ డెవలప్మెంట్) అబే కురువిల్ల(Abey Kuruvilla) తెలిపారు.