అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ఆరంభంలో శుభ్‌మన్ గిల్(43: 38 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్), ఆఖర్లో ఆండ్రూ రస్సెల్(45 నాటౌట్: 27 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) రాణించడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. నితీశ్ రాణా(15), రాహుల్ త్రిపాఠి(19), మోర్గాన్(0), సునీల్ నరైన్(0), దినేశ్ కార్తీక్(14) నిరాశపరిచారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయగా ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఆరంభంలో నితీశ్ రాణా(15) ఔటైనా మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నిలకడగా ఆడటంతో 69/1తో మంచి స్థితిలో నిలిచింది. కొన్ని ఓవర్ల వ్యవధిలోనే టపటపా వికెట్లు కొల్పోయింది. మధ్య ఓవర్లలో అనూహ్యంగా బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపట్టడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. రస్సెల్ దంచికొట్టడంతో చివరి 3 ఓవర్లలో కోల్‌కతా 42 రన్స్ రాబట్టింది. రబాడ వేసిన 19వ ఓవర్లో రస్సెల్ 4, 6, 6 కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. ఆవేశ్ ఖాన్ వేసిన 20 ఓవర్లో కమిన్స్ ఫోర్, రస్సెల్ సిక్స్ బాదడంతో కోల్‌కతా 150 మార్క్ దాటింది.
Innings Break: Birthday boy @Russell12A‘s unbeaten 45 off 27 balls takes his team to 154-6. #KKR score 59 runs in the last 5 overs.
— IndianPremierLeague (@IPL) April 29, 2021
Stay tuned for #DC’s chase https://t.co/iEiKUVwBoy #DCvKKR #VIVOIPL pic.twitter.com/W19yeSsvFc