న్యూఢిల్లీ: రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)కు .. ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. కేసును ఎందుకు కొట్టివేయాలన్న అంశంపై షార్ట్ నోట్ ఇవ్వాలని సింగ్ తరపున లాయర్‌ను ఢిల్లీ హైకోర్టు అడిగింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు బ్రిజ్‌పై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ కేసును సవాల్ చేస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్, ఛార్జ్‌షీట్, ట్రయల్ కోర్టు ఆదేశాలను ఆయన ప్రవ్నించారు. మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జరుగుతున్న దర్యాప్తును నిలిపివేయాలని బ్రిజ్ తన పిటీషన్లో కోరారు. బ్రిజ్‌పై నమోదు అయిన కేసును కొట్టివేయలేమని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తెలిపారు. మొత్తం ఆరుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆ రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.