న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్ దుశమంత చమీరా అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఐపీఎల్(IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతను ఆ క్యాచ్ అందుకున్నాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను మిచెల్ స్టార్క్ వేశాడు. వరుస బంతుల్లో స్టార్క్ వికెట్లను తీసుకున్నాడు. అయితే ఆ ఓవర్ నాలుగో బంతికి అంకుల్ రాయ్ ఓ ఫ్లిక్ షాట్ ఆడాడు. బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్‌లో అతను ఆ షాట్ కొట్ఆడు. అయితే డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న చమీరా.. కొంత దూరం ముందుకు పరుగెత్తి క్యాచ్‌ను పట్టేశాడు. లంక ప్లేయర్ చమీరా రన్నింగ్‌లోనే ముందు డైవ్ చేశాడు. గాలిలో ముందుకు దూకుతూ స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతున్నది.
Is that Superman? 🦸♂️ No, it’s #DushmanthaChameera!
Is this the best catch of the tournament so far? 🤯
Watch the LIVE action ➡ https://t.co/GeTHelSNLF#IPLonJioStar 👉 #DCvKKR | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar pic.twitter.com/2gl98tQN35
— Star Sports (@StarSportsIndia) April 29, 2025