DC vs UPW : తొలి మ్యాచ్‌లో వీర బాదుడు బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు రెండో మ్యాచ్‌లోనూ ధాటిగా ఆడుతున్నారు. షఫాలీ వర్మ (17), మేగ్ లానింగ్ (43) వరుసగా బౌండరీలో కొడుతున్నారు. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన ఆరో ఓవర్లో షఫాలీ ఒక ఫోర్, లానింగ్ 3 బౌండరీలు కొట్టింది. ఆరు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 62 రన్స్ చేసింది. షబ్నం ఇస్మాయిల్, అంజలీ సర్వానీ తొలి రెండు ఓవర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. దాంతో, స్కోర్ తక్కువ వచ్చింది. మూడో ఓవర్ నుంచి షఫాలీ, లానింగ్ దూకుడు పెంచారు.
మహిళల ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్‌లో యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ ఫీల్డింగ్ తీసుకుంది. గత మ్యాచ్‌లో విరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన గ్రేస్ హ్యారిస్‌ను యూపీ పక్కనపెట్టింది. ఆమె ప్లేస్‌లో షబ్నం ఇస్మాయిల్‌ను తీసుకుంది.