WPL Final 2023 | ముంబైతో ఫైనల్ పెద్ద ఛాలెంజ్.. షఫాలీ వర్మ చెలరేగితే విజయం మాదే : ఢిల్లీ కెప్టెన్
WPL 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ఫైనల్ పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫైనల్లో తలపడనున్నాయి. టైటిల్ ఫైట్‌లో ఇరుజట్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ (Meg Lanning), ముంబై సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఈరోజు ప్రీ- ఫైనల్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వీళ్లిద్దరూ తమ జట్టు బలాబలాల గురించి, మ్యాచ్ సన్నద్థత గురించి మాట్లాడారు.
WPL Final 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ఫైనల్ పోరు ఆసక్తికరంగా ఉండనుంది. టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫైనల్లో తలపడనున్నాయి. బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే టైటిల్ ఫైట్‌లో ఇరుజట్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ (Meg Lanning), ముంబై సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఈరోజు ప్రీ- ఫైనల్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వీళ్లిద్దరూ తమ జట్టు బలాబలాల గురించి, మ్యాచ్ సన్నద్థత గురించి మాట్లాడారు.
లానింగ్ ఏం అన్నదంటే..? ‘ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ను ఎదుర్కోవడం నిజంగా పెద్ద ఛాలెంజ్. ఆ జట్టులో గొప్ప ప్లేయర్స్ ఉన్నారు. ఈ టీమ్ ఎంత ప్రమాదకారమో మాకు తెలుసు. అయితే.. ఫైనల్లో గెలుస్తామని నాకు నమ్మకం ఉంది. షఫాలీ వర్మ చాలా కీలకం. ఆమె ప్రశాంతంగా మైదానంలోకి దిగి చెలరేగి ఆడాలి. నేను మరో ఎండ్ నుంచి ఆమె ఆటను ఆస్వాదించాలి అనుకుంటున్నా. ఫైనల్లో విజయం సాధించాలంటే ఫీల్డింగ్‌లో రాణించడం చాలా ముఖ్యం’ అని లానింగ్ తెలిపింది.
ప్రణాళిక ప్రకారం ఆడతాం
షఫాలీ, లానింగ్.. ఇద్దరూ మంచి ఓపెనింగ్ జోడీ. వీళ్లు మా జట్టుపై బాగా ఆడారు. అయితే.. మా ప్రణాళికలు మాకున్నాయి. వాటిని పక్కాగా అమలు చేస్తామని అనుకుంటున్నా. మా జట్టులో చాలామంది ఆటగాళ్లకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. వాళ్లకు తమ స్వదేశంలో కెప్టెన్లు, వైస్ కెప్టెన్లుగా పనిచేసిన అనుభవం ఉంది అని హర్మన్‌ప్రీత్ చెప్పుకొచ్చింది.
చెరొక విజయంతో..
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఈ లీగ్‌లో ఇప్పటివరకు రెండు సార్లు తలపడ్డాయి. చెరొక విజయం సాధించాయి. ఢిల్లీ జట్లు యూపీ వారియర్స్‌ను ఓడించి నేరుగా ఫైనల్ చేరింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై, యూపీని చిత్తు చేసింది. నాట్ స్కీవర్ బ్రంట్ అర్ధశతకం బాదడంతో భారీ స్కోర్ చేసింది. ఇసీ వాంగ్ హ్రాట్రిక్తో యూపీని దెబ్బకొట్టింది. అయితే.. కీలకమైన టైటిల్ పోరులో పైచేయి ఎవరిది? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఇవి కూడా చదవండి
Ravi Shastri | సచిన్ వంద సెంచరీల రికార్డు బ్రేక్ చేయడం కోహ్లీకి కష్టమే..! : రవిశాస్త్రి
IPL 2023 | ఐపీఎల్‌కు బెయిర్‌స్టో దూరం.. అతడి ప్లేస్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ను తీసుకున్న పంజాబ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

