కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా(ఎస్ఏ) టీ20 లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్-1మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 51 పరుగుల తేడాతో డర్బన్ సూపర్‌జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది.
రైజర్స్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యఛేదనలో జెయింట్స్ 19.3 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది.