FIFA World Cup: ఎక్స్ట్రా టైం థ్రిల్లర్.. కేప్ వెర్డేపై 3-2 గోల్స్ తేడాతో గెలిచిన అర్జెంటీనా
FIFA World Cup: ఎక్స్ట్రా టైంలో అర్జెంటీనా, కేప్ వెర్డే మ్యాచ్ థ్రిల్లర్‌లా సాగింది. ఎక్స్ట్రా టైంలోనే రెండు జట్లు కలిపి మూడు గోల్స్ చేశాయి. అయితే రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో విరోచిత కేప్ వెర్డేపై 3-2 గోల్స్ తేడాతో అర్జెంటీనా జట్టు విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో మెస్సీ ఆల్ టైం గోల్స్ సంఖ్య 20కి చేరింది. ఈ విక్టరీతో రౌండ్16కు వెళ్లింది అర్జెంటీనా.
కేప్ వెర్డే: ఆఖరి నిమిషంలో అర్జెంటీనా గట్టెక్కింది. ఫిఫా వరల్డ్‌కప్ టోర్నమెంట్లో తొలి సారి ఎంట్రీ ఇచ్చిన కేప్ వెర్డే.. రౌండ్32 మ్యాచ్‌లో అర్జెంటీనాను వణకించింది. కానీ ఎక్స్ట్రా టైం మ్యాచ్‌లో.. అర్జెంటీనా 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించి రౌండ్16లోకి ప్రవేశించింది. 111వ నిమిషంలో డిన్నే బోర్గ్స్ చేసిన సెల్ఫ్ గోల్‌తో డిఫెండింగ్ చాంపియన్ చివరి నిమిషంలో ఊపిరి పీల్చుకున్నది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో 64వ స్థానంలో ఉన్న కేప్ వెర్డే.. రెండు సార్లు అర్జెంటీనాతో సమంగా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆట ముగిసే వరకు రెండు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా ఉన్నాయి. దీంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైంలోకి వెళ్లింది.
అయితే 92వ నిమిషంలో లిసాండ్రో మార్టినేజ్ ఓ అద్భుతమైన గోల్‌తో అర్జెంటీనాకు ఆధిక్యాన్ని ఇచ్చాడు. కానీ కేప్ వెర్డే ప్లేయర్ సిడ్నీ లోప్స్ కాబ్రల్.. టోర్నీలోనే స్టన్నింగ్ గోల్ కొట్టాడు. 103వ నిమిషంలో అద్భుతమైన షాట్‌తో గోల్‌కీపర్ ఎమిలియానో మార్టినేజ్ మీదు నుంచి బంతిని గోల్ పోస్టులోకి కొట్టేశాడు. దీంతో రెండు జట్లు 2-2 గోల్స్‌కు చేరుకున్నాయి. మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లుందనుకున్న తరుణంలో కేప్ వెర్డే ప్లేయర్ డైనీ బోర్గ్స్ 111వ నిమిషంలో సెల్ఫ్ గోల్ కొట్టడంతో అర్జెంటీనా గెలుపు సునాయాసమైంది. కానీ మూడోసారి కేప్ వెర్డే మరో గోల్ చేయలేకపోయింది.
మియామీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఫుట్‌బాల్ అభిమానులు అర్జెంటీనా వైపు చీర్స్ కొట్టారు. ఈ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 29వ నిమిషంలో గోల్ చేసి తొలుత అర్జెంటీనాకు లీడ్ అందించాడు. దీంతో ప్రపంచ కప్ టోర్నీలో మెస్సీ కొట్టిన గోల్స్ సంఖ్య 20కి చేరుకున్నది. అర్జెంటీనా తన అనుభవంతో గెలిచినా.. ఈ టోర్నీలో మాత్రం కేప్ వెర్డే పెను సంచలనం నమోదు చేసింది. తొలిసారి వరల్డ్‌కప్ ఆడుతున్న ఆ చిన్న దేశం.. నాకౌట్‌కు చేరుకున్నది. గ్రూప్ స్టేజ్‌లో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో కేప్ వెర్డే గోల్ కీపర్ వోజిన్నా అద్భుతమైన స్కిల్స్‌ను ప్రదర్శించాడు. ఆ మ్యాచ్ డ్రా కావడంతో అతన్ని హీరోగా పోల్చారు.
40 ఏళ్ల గోల్‌కీపర్ వోజిన్నా.. ప్రీ క్వార్టర్స్‌లోనూ మెస్సీ కొట్టిన రెండు షాట్లను చాకచక్యంగా అడ్డుకున్నాడు. ఇక అర్జెంటీనా జట్టులో మెస్సీతో పాటు మార్టినేజ్ ఇంకా రాటుదేలిపోతున్నారు. కేప్ వెర్డే ఓడినా.. ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల మనసును ఆ దేశం గెలుచుకున్నది. రౌండ్16 మ్యాచ్‌లో ఈజిప్ట్‌తో అర్జెంటీనా ఆడనున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

