మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ (యూఎస్)కు ప్రిక్వార్టర్స్‌లో షాక్ తగిలింది. మెల్బోర్న్లోని రాడ్లీవర్ ఎరీనా వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 9వ సీడ్ కీస్.. 3-6, 4-6తో అమెరికాకే చెందిన జెస్సికా పెగులా చేతిలో ఓడింది. క్వార్టర్స్‌లో మరో యూఎస్ సంచలనం అమందా అనిసిమొవతో ఆమె తలపడనుంది.
రెండో సీడ్ ఇగా స్వియాటెక్.. 6-0, 6-3తో మాడిసన్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ సిన్నర్ (ఇటలీ) 6-1, 6-3, 6-7 (2/7)తో తన దేశానికే చెందిన లుసియానోను ఓడించాడు. ఐదో సీడ్ ముసెట్టి.. 6-2, 7-5, 6-4తో టేలర్ ఫ్రిట్జ్ (యూఎస్)ను ఇంటికి పంపించాడు. కాస్పర్ రూడ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ షెల్టన్ గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.