ఇండోర్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి స్ఫూర్తిధాయక ఆటతీరుతో మహిళల వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టింది. ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లండ్ మొదట బంతితో ఆ తర్వాత బ్యాట్‌తో ఇంగ్లండ్ పనిపట్టింది. ఇంగ్లిష్ జట్టు నిర్దేశించిన 245 పరుగుల ఛేదనలో ఒకదశలో 68 రన్స్‌కే 4 కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అన్నాబెల్ (98*).. ఆష్లే గార్డ్నర్ (104*) తో ఐదో వికెట్‌కు అజేయంగా 180 పరుగులు జోడించి ఆసీస్‌కు ఈ టోర్నీలో ఐదో విజయాన్ని కట్టబెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. నిర్ణీత ఓవర్లలో 244/9 చేసింది.