ఢిల్లీ: భారత్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అన్ సె యంగ్ (మహిళలు), అలెక్స్ లేనియర్ (పురుషులు) సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో దక్షిణ కొరియా అమ్మాయి, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ యంగ్.. 21-17, 21-14తో అకానె యమగుచి (జపాన్)ను వరుస గేమ్స్‌లో చిత్తుచేసి టైటిల్‌ను నిలబెట్టుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫ్రాన్స్ కుర్రాడు అలెక్స్.. 21-11, 21-11తో కొడాయ్ నరొక (జపాన్)ను చిత్తుగా ఓడించాడు. తద్వారా అతడు ఫ్రాన్స్ తరఫున ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన తొలి షట్లర్‌గా రికార్డులకెక్కాడు.