జైపూర్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్ఎల్)లో తెలుగు టాలన్స్‌కు నిరాశ ఎదురైంది. శనివారం ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో తెలుగు టాలన్స్ పెనాల్టీ షూటౌట్లో పరాజయం పాలైంది. పెనాల్టీ షూటౌట్లో తెలుగు టాలన్స్ 3 గోల్స్ కొట్టగా.. గోల్డెన్ ఈగల్స్ యూపీ 4 గోల్స్ సాధించింది. ఆదివారం జరుగనున్న టైటిల్ పోరులో మహరాష్ట్రతో యూపీ తలపడనుంది. నిర్ణీత సమయంలో తెలుగు టాలన్స్, యూపీ 35-35తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. మ్యాచ్ మరో పది నిమిషాలు పొడిగించగా.. స్కోర్లు 40-40తో మరోసారి సమమయ్యాయి. దీంతో విజేతను తేల్చేందుకు షూటౌట్ అనివార్యమైంది. తెలుగు టాలన్స్ తరఫున కైలాష్ పటేల్ 15 గోల్స్‌తో మెరువగా.. దేవిందర్ సింగ్, నసీబ్ సింగ్ ఆరేసి గోల్స్‌తో రాణించారు. యూపీ తరఫున భూషణ్ షిండే 15 గోల్స్‌తో సత్తాచాటాడు.